హరిహర వీరమల్లు విడుదల తేదీ ప్రకటన

పవన్ కళ్యాణ్ – క్రిష్ కలయికలో తెరకెక్కుతున్న చారిత్రక చిత్రం హరిహర వీరమల్లు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం తాలూకా క్రేజీ అప్డేట్ ఇచ్చి అభిమానులను సంతోషపరిచారు. ఈరోజు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నేపథ్యంలో ఈ సినిమాను ఏప్రిల్ 29 , 2022 న రిలీజ్ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేసారు.

ఈ సినిమాలో పవన్ బందిపోటుగా కనిపించనున్నారని తెలుస్తోంది. అలాగే ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్​గా నటిస్తుండగా బాలీవుడ్ నటులు జాక్వెలిన్ ఫెర్నాండేజ్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. పవన్ కల్యాణ్ కెరియర్లోనే భారీ బడ్జెట్‌‌‌‌‌తో ఈ మూవీ ని ఏ ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం కోట్ల రూపాయల ఖర్చుతో భారీ సెట్లు వేయించారు.

జ‌న‌వ‌రి 12, 2022న పవన్ నటిస్తున్న భీమ్లా నాయ‌క్ విడుద‌ల కానుండ‌గా, సినిమా రిలీజైన మూడు నెల‌ల‌కు హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రం థియేట‌ర్స్‌లోకి రానుంది. ఈ సినిమాకి సంబంధించి ఇప్ప‌టికే మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల చేయగా..ఇప్పుడు బర్త్ డే ప్రత్యేకంగా సరికొత్త పోస్టర్ విడుదల చేసి ఆకట్టుకున్నారు.

Someone who always thinks about d society n serves habitually in any event with such pride n conviction like u do deserve d world n more @pawankalyan sir.

You are, and always will be, a true hero n it’s an honour to be wishing you well on your birthday 💐💐#HariHaraVeeraMallu pic.twitter.com/O5Gqk35v61— Krish Jagarlamudi (@DirKrish) September 2, 2021