శత్రువులపై దండెత్తడానికి రథంపై వెళ్తున్న పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..ఈ పేరు ఇప్పుడు సోషల్ మీడియా లో ట్రెండ్ సెట్ చేస్తుంది. రేపు (సెప్టెంబర్ 2) పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్బంగా అభిమానులు సోషల్ మీడియా లో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇదే అనుకుంటే పవన్ కళ్యాణ్ నటిస్తున్న కొత్త చిత్రాల తాలూకా అప్డేట్స్ , పోస్టర్స్ అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు నుండి సరికొత్త పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. రేపు సాయత్రం 5.45 గంటలకు పవర్ గ్లాన్స్ విడుదల చేయనున్నట్లు పోస్టర్ ద్వారా తెలిపారు. ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ కోర మీసం, పొడవాటి జుట్టుతో ఉన్న పవన్ శత్రువులపై దండెత్తడానికి రథంపై వెళుతున్నాడు.
ఇప్పటివరకు ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ 50 శాతం పూర్తయిందని, త్వరలో నూతన షెడ్యూల్ ప్రారంభమవుతుందని నిర్మాత ఎ. దయాకర్ రావు వెల్లడించారు. ప్రేక్షకులను అలరించేలా ‘హరిహర వీరమల్లు’ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో రూపు దిద్దుకుంటోందని తెలిపారు. పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల జరిగే కథతో విజువల్ ఫీస్ట్ గా రూపొందుతోంది. ఒక లెజండరీ బందిపోటు వీరోచిత గాథ అని, భారతీయ సినిమాలో ఇప్పటిదాక ఇలాంటి కథను తెరకెక్కించలేదని చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో ఏకకాలంలో విడుదల చేయనున్నారు. క్రిష్ దర్శకత్వంలో లెజెండరీ ప్రొడ్యూసర్ ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మాత ఎ.దయాకర్ రావు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.