నాకు స్పూర్తి ధోనీనే

ముంబై ఇండియన్స్ ఆటగాడు హార్ధిక్ పాండ్య ధోని తన లెజెండ్ అని, క్రికెట్ అభిమానుల గుండెల్లో ఎప్పటికి నిలిచిపోయే పేరని అంటున్నాడు. ఐపిఎల్-12 సీజన్లో క్వాలిఫయిర్ 1లో చెన్నై సూపర్‌కింగ్స్, ముంబై ఇండియన్స్ తలపడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చపాక్ స్టేడియంలో ధోనీతో ఉన్న ఓ ఫోటోను పాండ్య ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. నా స్పూర్తి, , నా స్నేహితుడు ,నా లెజెండ్ ఈయనే..ఎంఎస్ ధోని అని పాండ్య ట్వీట్ చేశారు. దీంతో పాటు ధోని హెలికాప్టర్ షాట్లను గుర్తు చేస్తూ హెటికాప్టర్ ఇమోజిని పెట్టారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/