ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

new-year-2020-celebrations
new-year-2020-celebrations

ఆస్ట్రేలియా: ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర సంబురాలు అంబరాన్నంటాయి. కొత్త ఏడాదికి ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. సమోవా, టోంగా, కిరిబాటి దీవుల్లో మొట్టమొదటిగా న్యూ ఇయర్‌ వేడుకలు మొదలయ్యాయి. అనంతరం న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా కొత్త ఏడాదికి స్వాగతం పలికాయి. ఆక్లాండ్‌లోని స్కై టవర్‌పై బాణసంచా వెలుగులు కనువిందు చేశాయి. ఆస్ట్రేలియాలోని ప్రఖ్యాత సిడ్నీ హార్బర్‌ వద్ద న్యూ ఇయర్‌ వేడుకలు మిన్నంటాయి. కార్చిచ్చుల నేపథ్యంలో ఫైర్‌వర్క్‌ను నిలిపివేయాలని ఆస్ట్రేలియాలో పెద్ద ఎత్తున డిమాండ్‌లు వచ్చినప్పటికీ నిర్వాహకులు మాత్రం పట్టించుకోలేదు. భారత్‌లోనూ నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/