పాఠశాలల్లో గణతంత్ర ఉత్సవాలు

HAPPY INDEPENDENCE DAY
HAPPY INDEPENDENCE DAY

విద్యానగర్‌ : పింగళి వెంకయ్య ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో శనివారం గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా పలు ప్రభుత్వ పాఠశాలల్లో మిఠాయిలు పంచిపెట్టారు. వ్యాసరచన పోటీలలో విజేతలకు పురస్కారాలను అందించారు.ట్రస్ట్‌ ప్రతినిధి శ్యామలరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పలువురు సీనియర్‌ సిటిజన్‌లు హాజరయ్యారు.స్కై ఉత్సవాలుస్కై ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ముషీరాబాద్‌, భోలక్‌పూర్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులకు అవసరమైన స్టేషనరీ సామాగ్రిని పంపిణీ చేశారు. ఫౌండేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు సంజీవ్‌కుమార్‌, పావని, పలువురు ఐటి ఉద్యోగులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.