సీఎం జగన్‌కు హ్యాపీ క్రిస్మస్.. కేశినేని సెటైరికల్ ట్వీట్

kesineni nani
kesineni nani

అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌ సర్కారుపై తనదైన శైలిలో ట్విట్టర్‌ వేదికగా టిడిపి ఎంపీ కెశినేని నాని విమర్శలు చేశారు. ఈరోజు క్రిస్మస్‌ పండగ సందర్భంగా సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డికి మరియు వైఎస్‌ఆర్‌సిపి మంత్రులకు ఆయన శుభాకాంక్షలు చేబుతూనే వారిపై వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను అనిశ్చితిలో పడేసిన వైఎస్‌ జగన్‌ మరియు వైఎస్‌ఆర్‌సిపి గ్యాంగ్‌కి ప్రత్యేకమైన క్రిస్టమస్‌ శుభాకాంక్షలు అని చెప్పారు. రాష్ట్రం ఏమి అయినా పర్వాలేదు కానీ మీరు మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలని క్రిస్టమస్‌ సందర్భంగా భగవంతుడిని కోరుకొండి అని కేశినేని నాని వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/