రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

PM Modi -President Ram Nath Kovind
PM Modi -President Ram Nath Kovind

న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈరోజు తన జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖుల నుంచి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలో ట్వీటర్ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తదితరులు రామ్ నాథ్ కోవింద్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో ఉంటూ మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/