34వ పడవలోకి శిఖర్‌ ధావన్‌: నెటిజన్ల విషెస్‌ వెల్లువ

Shikhar Dhawan
Shikhar Dhawan

హైదరాబాద్‌: టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ 34వ ఏటా అడుగు పెట్టారు. ఈ సందర్భంగా ప్రస్తుత క్రికెటర్లతో పాటు మాజీ క్రికెటర్లు కూడా అతడికి సోషల్‌ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అతని అభిమానులు కూడా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 2004 అండర్‌-19 వరల్డ్‌కప్‌ అత్యధిక స్కోరును సాధించి ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరగేట్రం చేశారు. తన అరంగేట్రం ఢిల్లీ తరపున రంజీ మ్యాచ్‌లో అతడు 187 పరుగులున చేసి అత్యధిక స్కోరును తన ఖాతాలో వేసుకున్న అరగేట్రం ఆటగాడినా నిలిచారు. ధావన్‌ మెరుపు వేగంతో బంతులను బౌండరీ బాట పట్టించగలడు, అందుకే అభిమానులు అతడిని ముద్దుగా గబ్బర్‌ అని పిలుస్తుంటారు. ధావన్‌ తన కంటే పదేళ్లు పెద్దదైన బెంగాలీకి చెందిన ఆయేషాను వివాహమాడారు. ఇప్పుడు వీరి ఒక కుమారుడు ఉన్నాడు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/