గుంటూరులో టీడీపీ కి భారీ షాక్..కీలక నేత రాజీనామా

తెలుగుదేశం పార్టీ కి వరుస షాకులు తప్పడం లేదు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగిన ఓటమి పలకరిస్తుండగా..మరోపక్క కీలక నేతలంతా రాజీనామా చేస్తూ బాబు కు షాకులు ఇస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీకి షాక్ తగిలింది. మాజీ మంత్రి, ఆప్కో చైర్మన్ మురుగుడు హనుమంతరావు పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వటం లేదని.. పార్టీ తన సేవలు ఉపయోగించుకోవడం లేదని ఆయన వాపోయారు. గత ఏడాది నుంచి టీడీపీకి దూరంగా ఉంటున్నానని.. ఏ పార్టీలోకి వెళ్ళేది కార్యకర్తలు, అభిమానులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని చెప్పుకొచ్చారు.

గడచిన ఎన్నికల తరువాత అనేక మంది టీడీపీ నేతలు, ప్రజా ప్రతినిధులు పార్టీ గుడ్ బై చెప్పి అధికార వైసీపీలోకి చేరిన సంగతి తెలిసిందే. నలుగురు ఎమ్మెల్యేలు సైతం అనధికారికంగా వైసీపీలోకి వెళ్లిపోయారు. ఇప్పుడు మురుగుడు హనుమంతరావు టీడీపీ కి రాజీనామా చేసారు. త్వరలో వైసీపీ గూటికి చేరబోతున్నట్లు అంత చెపుతున్నారు. మంగళగిరి నియోజకవర్గం నుండి 1999, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన మురుగుడు హనుమంతరావు గతంలో ఆప్కో చైర్మన్ గా, మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం రాజకీయ పరిణామాల నేపథ్యంలో హనుమంతరావు టీడీపీలో చేరారు. అయితే టీడీపీలో ఆయనకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న అసంతృప్తితో ఉన్నారు. అయితే పార్టీపై అసంతృప్తితో ఉన్న హనుమంతరావు టీడీపీకి గుడ్ బై చెప్పారు.