వి.హనుమంతరావు ఇంటిపై దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు

హైదరాబాద్, అంబర్‌పేటలోని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు ఇంటిపై రాళ్ల దాడి జరిగిన విష‌యం తెలిసిందే. అర్ధరాత్రి ఇంటి ఫై ఓ వ్యక్తి రాళ్ల దాడి చేసాడు. ఇంటి ముందు ఉన్న కార్ ను ధ్వసం చేసాడు. ఈ ఘటన తో అంత ఉలిక్కి పడ్డారు. సీనియర్ నేతకు రక్షణ లేదని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. కాంగ్రెస్ నేత‌ల‌పై దాడుల‌కు పాల్ప‌డితే ఊరుకునేది లేద‌ని హెచ్చ‌రించారు.

తెలంగాణ‌లో రోజు రోజుకూ శాంతి భ‌ద్ర‌త‌లు క్షీణిస్తున్నాయ‌ని ఆయ‌న చెప్పారు. వి.హనుమంతరావు ఇంటిపై రాళ్ల దాడికి పాల్ప‌డిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. కాగా ఈ దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సిద్ధార్థ సింగ్‌గా పోలీసులు గుర్తించారు. గత ఆరు నెలలుగా వీహెచ్ ఇంటి పక్కనే సిద్ధార్థ నివాసం ఉంటున్నాడు. మద్యం మత్తులో వీహెచ్ ఇంటి పైన దాడి చేశాడు. ప్రస్తుతం సిద్ధార్థ్ అంబర్ పేట్ పోలీసుల అదుపులో ఉన్నాడు.