హ‌నుమాన్ జ‌యంతి.. రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ సూచ‌న‌లు

శాంతి, భ‌ద్ర‌త‌ల‌కు స‌మ‌స్యలు త‌లెత్త‌కుండా ఉండేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టాలి..

hanuman-jayanti-tomorrow-here-is-advisory-by-home-ministry

న్యూఢిల్లీః రేపు దేశ‌వ్యాప్తంగా హ‌నుమాన్ జ‌యంతి ఉత్స‌వాలు జ‌ర‌గ‌నున్నాయి. అయితే ఇటీవల శ్రీరామ న‌వ‌మి ఉత్స‌వాల ఊరేగింపు స‌మ‌యంలో ప‌లు రాష్ట్రాల్లో హింసాత్మ‌క‌ సంఘ‌ట‌న‌లు చోటుచేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కేంద్ర హోంశాఖ ఈరోజు కొన్ని సూచ‌న‌లు జారీ చేసింది. హ‌నుమాన్ జ‌యంతి సంద‌ర్భంగా అన్ని రాష్ట్రాలు శాంతి, భ‌ద్ర‌త‌ల విష‌యంలో చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కేంద్ర హోంశాఖ త‌న అడ్వైజ‌రీలో పేర్కొన్న‌ది. జ‌యంతి ఉత్స‌వాలు శాంతియుంగా నిర్వ‌హించేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని రాష్ట్రాల‌ను కోరింది. స‌మాజంలో శాంతి, భ‌ద్ర‌త‌లు లోపించ‌కుండా ఉండేందుకు క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని త‌న ప్ర‌క‌ట‌న‌లో హోంశాఖ పేర్కొన్న‌ది.