హ‌నుమాన్ శోభాయాత్ర‌లో ముస్లింలు చేసిన పనికి అంత ఫిదా అవుతున్నారు

శనివారం హనుమాన్ జయంతి సందర్బంగా దేశ వ్యాప్తంగా హ‌నుమాన్ శోభాయాత్ర‌ ఎంతో కన్నుల పండుగగా జరిగింది. కాగా భోపాల్ లో హ‌నుమాన్ శోభాయాత్ర‌లో ముస్లింలు పాల్గొని మ‌త‌సామ‌ర‌స్యం చాటుకున్నారు. అంతే కాదు హ‌నుమంతుడిపై పూల వ‌ర్షం కురిపించి.. భ‌క్తుల‌కు ముస్లింలు హ‌నుమాన్ జ‌యంతి శుభాకాంక్ష‌లు తెలిపారు. జై హ‌నుమాన్ అంటూ నిన‌దించి.. త‌మ భ‌క్తిని చాటుకున్నారు. ఒకరిద్దరు కాదు దాదాపు 5 వేలమంది పాల్గొని అందర్నీ ఆకట్టుకున్నారు. హ‌నుమాన్ శోభాయాత్ర నేప‌థ్యంలో ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పటు చేసారు. ఖాజీ క్యాంప్ ఏరియాలో శోభాయాత్ర‌కు అనుమ‌తి ఇవ్వ‌లేదు. దీంతో వేరే మార్గంలో శోభాయాత్ర‌ను కొన‌సాగించారు.

ఇక ఢిల్లీ లో మాత్రం శోభాయాత్ర హింసాత్మకంగా మారింది. రెండువర్గాలు పరస్పరం దాడులకు దిగడంతో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ ఘర్షణల్లో సాధారణ పౌరులతోపాటు పోలీసులు కూడా గాయపడ్డారు. జహంగిర్‌పూరి ప్రాంతంలోని కుశాల్‌ సినిమా థియేటర్‌ దగ్గరకు రాగానే ఊరేగింపుపై కొందరు దుండగులు రాళ్లు విసిరారు. ఢిల్లీలో అక్రమంగా నివసిస్తున్న కొందరు బంగ్లాదేశీయులే ఈ ఘర్షణలకు కారణమని బీజేపీ నేత కపిల్‌ మిశ్రా ఆరోపించారు.