ఆకట్టుకునే హ్యాండ్‌ బ్యాగ్‌ డిజైన్లు

ఫ్యాషన్‌ ఫ్యాషన్‌…

Hand bags
Hand bags

కాలంతోపాటు ఫ్యాషన్‌ ప్రపంచం వేగంగా మారిపోతోంది. చెప్పుల దగ్గర నుంచి తలపిన్నుల వరకు రోజుకొక మోడల్‌ మార్కెట్లోకి విడుదలవుతున్నాయి.

ఇప్పుడు హ్యాండ్‌బ్యాగులు కొత్తరకం వచ్చాయి.కాస్త ఖరీదు ఎక్కవైనా సరే బ్యాగు లేటెస్ట్‌ మోడల్‌లో ఉండాలనుకోవడం అత్యాశేం కాదంటున్నారు ఈతరం మహిళలు.

అందుకే అభిరుచులకు తగినట్లుగా బ్యాగుల్ని ఎప్పటికప్పుడు మార్చేస్తున్నారు. అల్మారాలోని దుస్తులకు మ్యాచ్‌ అచ్యేలా వాటి కలెక్షన్‌నూ పెంచుకుంటూ కనీసం ఐదారు రకాల మోడళ్ల బ్యాగులు ఉండేలా చూసుకుంటున్నారు. ఆ బ్యాగులతోపాటూ వాటికున్న పట్టీలనూ ఎప్పటికప్పుడు మార్చుకోవడమే తాజా ట్రెండ్‌.

Hand bag designs

నిజానికి బ్యాగును బట్టి స్ట్రాప్‌ సన్నగా లేదా కాస్త వెడల్పుగా పొడుగ్గా లేదా పొట్టిగా ఉంటుంది. కొన్ని రకాలకైతే మధ్యలో చిన్న బకెల్‌లా వేసుకునేలా వస్తాయి. ఆ స్ట్రాప్‌ కూడా తొంభైశాతం సాదాగా బ్యాగు రంగులోనే ఉంటుంది.

కొత్తగా వస్తున్న ఈస్ట్రాప్స్‌ మాత్రం హ్యాండుబ్యాగు రంగులోనే ఉండాలని లేకుండా భిన్నమైన డిజైన్లూ ప్రింట్లలో వస్తూ నయా లుక్‌తో కనికట్టు చేస్తున్నాయి.

రకరకాల పూల డిజైన్లు దుస్తులపై అందంగా అమరిపోయే ఎలా ఆకట్టుకుంటాయో, అదేవిధంగా బ్యాగ్‌స్ట్రాప్స్‌పైనా చేరి, పూలతలు వరరింజితంగా కనిపిస్తున్నాయి.

ఆ డిజైన్లను పెయింట్‌ వేయడం ఒక తరహా అయితే స్ట్రాప్‌ అంతా అక్కడక్కడా పూలు పెట్టినట్లుగా ఆప్లిక్‌ వర్క్‌ చేయడం మరో తరహా. లెదర్‌ లేదా రెక్సిన్‌ లెదర్‌ను పూల ఆకృతుల్లో కత్తిరించి, వాటికి ముత్యాలు లేదా ఇతరపూసలు జత చేసి స్ట్రాప్స్‌పై అతికిస్తారు.

Hand bag designs

అంత డిజైను వద్దనుకుంటే స్ట్రాప్స్‌పైన ముచ్చటగా ఎంబ్రాయిడరీ కూడా చేయించుకోవచ్చు. అవేకాదు సీతాకోకచిలుకలూ మామిడిపిందెలూ జామెట్రిక్‌ డిజైన్లూ పట్లీపైన వైవిధ్యంగా రిపోతున్నాయి.

బ్యాగుస్ట్రాప్‌ కాస్త ఫంకీలుక్‌తో కనిపించాలనికోరుకునే అమ్మాయిలు రకరకాల రంగురాళ్లు అందంగార్చినవీ, పండ్ల బొమ్మలు వేసినవీ ఎంచుకోవచ్చు.

ఈ హంగులేవీ లేకుండా పట్టీ సింపుల్‌గా ఉండాలనుకుంటే నచ్చిన అక్షరాలను వాటిపైన రాయించుకోవచ్చు. ఈ హంగులేవీ లేకుండా పట్టి సింపుల్‌గా ఉండాలనుకుంటే నచ్చిన అక్షరాలను వాటిపైన రాయించుకోవచ్చు

లేదా చిన్నచిన్న కుందన్లుగానూ అతికించుకోవచ్చు. అలాగే పట్టీనే డిజైను రూపంలో మార్చేసి పెయింట్‌ వేసి పూసలూ రాళ్లూ లోహంతో చేసిన డ్రాప్స్‌ని అతికించిన రకాలూ దొరుకుతాయి.

వాటికి ఉండే హుక్కులు తీసిపెట్టుకునే విధంగానే ఉంటాయి కాబట్టి కనీసం రెండుమూడు రకాలు కొనిపెట్టుకుంటే ఎప్పటికప్పుడు నచ్చినట్లుగా మార్చుకోవచ్చు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/