క్యాన్సర్ నుండి బయటపడ్డ హంసా నందిని

హంసా నందిని కాన్సర్ బారినుండి క్షేమంగా బయటపడింది. అనుమానాస్పదం మూవీ తో 2007 లో తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టిన హంసా నందిని..హీరోయిన్ గా , ఐటెం సాంగ్స్ లలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించింది. 2021 లో తాను రొమ్ము క్యాన్సర్ వ్యాధి బారిన పడ్డట్లు తెలిపింది. ఇందుకోసం ఈమె శస్త్రచికిత్స చేయించుకుంది. జన్యుపరంగా ఆ వ్యాధి తిరగబెట్టే అవకాశం ఉండటంతో ఇంకా మరిన్ని శస్త్రచికిత్సలు, కీమోథెరపీ చికిత్సలు చేయించుకున్నట్లు తెలిపింది. ఈమె తల్లి కూడా 2003 లో క్యాన్సర్ వ్యాధితోనే మరణించింది.

బ్రెస్ట్‌ క్యాన్సర్‌ నుంచి కోలుకునేందుకు హంస 16 సైకిల్స్‌ కీమోథెరపీ చేశారు. ఈ క్రమంలో చికిత్సకి సంబంధించి రెగ్యులర్‌గా అప్‌డేట్స్ చెప్తూ వచ్చిన హంసా నందిని.. ఫొటోల్ని కూడా షేర్ చేసింది. అయితే.. ఎట్టకేలకి ఆమె కోలుకుని మళ్లీ షూటింగ్‌లో పాల్గొంటూ ‘ఐ యామ్ బ్యాక్’ అంటూ రాసుకొచ్చింది. దాంతో నెటిజన్లు కూడా ఆమె క్యాన్సర్‌ని జయించి రావడాన్ని స్వాగతిస్తూ.. ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు.