అబుదాబి రేస్‌కు హామిల్టన్‌ రెడీ

తాజా కొవిడ్‌ పరీక్షలో నెగెటివ్‌

Hamilton ready for Abu Dhabi race
Hamilton

అబుదాబి : కరోనా బారిన పడిన ఫార్ములా వన్‌ డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ తాజా కొవిడ్‌ పరీక్షలో నెగెటివ్‌గా తేలడంతో వచ్చే వారం జరిగే అబుదాబి రేస్‌లో పాల్గొననున్నాడు.

కరోనా కారణంగా హామిల్టన్‌ గతవారం జరిగిన బహ్రెయిన్‌లో జరిగిన సాఖిర్‌ గ్రాండ్‌ ప్రి రేస్‌లో పాల్గొనలేకపోయాడు.

అతని స్థానంలో బ్రిటన్‌కే చెందిన జార్జి రస్సెల్‌ మెర్సిడెస్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఇపుడు రస్సెల్‌ తిరిగి తన పాత సంస్థ విలియమ్స్‌ తరఫున బరిలోకి దిగుతాడు.

బహ్రెయిన్‌లో పది రోజులపాటు క్వారంటైన్‌ పూర్తిచేసుకున్న హామిల్టన్‌ గురువారం అబుదాబిలోని యాస్‌ మరినా సర్క్యూట్‌కు చేరుకున్నాడు.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/