తల్లిదండ్రులు ఫోన్ల వాడకంపై చిన్నారుల నిరసన

హాంబర్గ్: స్మార్ట్‌ఫోన్ మనిషి జీవితాన్ని ఎంత ప్రభావితం చేస్తుందో ప్రత్యక్షంగా కళ్ల ముందు కనబడుతుంది. ఐతే వాటితోని బంధాలు అనుబంధాలు దూరమవుతున్నాయి. పిల్లలు గేమ్స్ ఆడుతూ బిజీగా ఉంటే తల్లిదండ్రులు సోషల్ మీడియాలో నిమగ్నమవుతున్నారు. పేరెంట్స్ ఇద్దరూ స్మార్ట్ఫోన్లు పట్టుకుని తమను పట్టించుకోవడంలేదని బాధపడే పిల్లలు మరికొందరున్నారు. తల్లిదంద్రులిద్దరూ స్మార్ట్‌ఫోన్‌తో తలదూర్చడంతో ఎవరితో మాట్లాడాలో ఎవరికి కబుర్లు చెప్పాలో తెలియక చిన్నారులు సతమతమవుతున్నారు. జర్మనీలో ఇలాంటి ఇబ్బందే ఎదుర్కొంటున్న ఓ బుడతడు తనలాంటి వారిని ఏకం చేసి మమ్మీ డాడీ స్మార్ట్ఫోన్లను వదిలిపెట్టాలంటూ నిరసన ప్రదర్శన చేపట్టాడు.
పేరెంట్స్ ఫోన్ల వినియోగానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన ప్రదర్శనకు ఏడేళ్ల ఎమిల్ నేతృత్వం వహించాడు. ప్లకార్డులు పట్టుకుని మేమున్నామని గుర్తించండి, మాతో ఆడండి స్మార్ట్ఫోన్లతో కాదంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ నిరసన ప్రదర్శన ద్వారానైనా తల్లిదండ్రులు తమ బాధను అర్ధం చేసుకుంటారని భావిస్తున్నామని పిల్లలు చెబుతున్నారు.
జర్మనీలోని హాంబర్గ్‌లో చేపట్టిన ఈ నిరసన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎమిల్ ఉద్యమానికి ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/