షూ లేసులు కట్టుకోలేనివారు.. ధోని గురించి మాట్లాడేది

చర్చించడానికి వేరే విషయాలు లేకే ఇలాంటి చర్చ

Ravi Shastri
Ravi Shastri

న్యూఢిల్లీ: క్రికెట్ కు ధోనీ ముగింపు పలకాలని కొందరు తహతహలాడుతున్నారని టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి మండిపడ్డారు. ధోనీని విమర్శిస్తున్నవారిలో సగం మందికి షూ లేసులు కూడా కట్టుకోవడం చేతకాదని ఎద్దేవా చేశారు. క్రికెట్ నుంచి ఎప్పుడు వైదొలగాలో ధోనీకి తెలుసని చెప్పారు. టీమిండియాకు ధోనీ నీడలాంటివాడని… ధోనీ రిటైర్మెంట్ పై వ్యాఖ్యలు చేయడమంటే అతడిని అవమానించినట్టేనని అన్నారు. భవిష్యత్తులో క్రికెట్ కు ధోనీ వీడ్కోలు పలుకుతాడనే విషయం అందరికీ తెలుసని… సమయం వచ్చినప్పుడు ఆయనే నిర్ణయం తీసుకుంటాడని చెప్పారు. చర్చించడానికి వేరే విషయాలు లేకనే ధోనీ రిటైర్మెంట్ పై కొందరు చర్చిస్తున్నారని మండిపడ్డారు.
తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/