హాజీపూర్‌ నిందితుడిని ఎన్‌కౌంటర్‌ చేయాలి

psycho killer srinivas reddy
psycho killer srinivas reddy

హైదరాబాద్‌: దిశ హత్యకేసులో నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసినట్లు సైకో శ్రినివాస్‌రెడ్డిని కూడా ఎన్‌కౌంటర్‌ చేయాలని హాజీపూర్‌ గ్రామస్థులు డిమండ్‌ చేస్తున్నారు. ఇటీవల ముగ్గురు బాలికలను కర్కశంగా హత్యచేసిన యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌కు చెందిన సైకో కిల్లర్‌ శ్రీనివాస్‌నూ చంపేయాలని ఆ గ్రామస్థులు డిమాండ్‌ చేస్తున్నారు. కాగా శ్రావణి హత్యనంతరం పోలీసులు తమదైన శైలిలో శ్రీనివాస్‌ రెడ్డిని విచారించగా మార్చిలో అదృశ్యమైన మనీషాను తానే అత్యాచారం చేసి హత్య చేశానని ఒప్పుకున్నాడు. దీంతోపాటూ 2015 ఏప్రిల్‌ 22న అదృశ్యమైన మైసిరెడ్డిపల్లికి చెందిన కల్పన 11ను తానే హత్య చేశానని అంగీకరించడంతో యావత్‌ రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కపడింది. ముక్కుపచ్చలారని బాలికలను అత్యాచారం చేసి హత్య చేయడంతో నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆ రెండు గ్రామాలోపాటూ ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/