జుట్టు రాలకుండా ఉండేందుకు..

Hair Loss

ప్రస్తుతం ఎక్కడ చూసినా వాతావరణ కాలుష్యమే. దుమ్ము, ధూళి సాధారణమైపోయింది. బయటికెళ్లాలంటే భయంగా ఉంటోంది. జుట్టుకు ఎంత రక్షణచర్యలు తీసుకున్నప్పటికీ కాలుష్యానికి జుట్టు రాలిపోవడం, బలహీనం కావడం సాధారణమైంది. ఎంత మంచి షాంపూలు వాడినా, బ్రాండెడ్‌ నూనెలు వాడినా జుట్టురాలడం తగ్గనప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. అవి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మరి వాటి గురించి తెలుసుకుందామా! తల దువ్వుకునే సమయంలో దువ్వెనకు వెంట్రుకలు వచ్చే తీరును బట్టే హెయిర్‌ ఫాల్‌ ఏ స్టేజ్‌లో ఉందో తెలుసుకోవచ్చు. అందుకే జుట్టు రాలుతుందని గమనించిన వెంటనే చక్కటి హోమ్‌రెమిడీస్‌తో ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు.

కొబ్బరి నూనెలో కొన్ని ఉసిరి ముక్కల్ని వేసి ఉడికించాలి. ఆ నూనె చల్లారిన తర్వాత అందులోని ఉసిరి ముక్కల్ని తీసేయాలి. నూనెను ఒక సీసాలో భద్రపరుచుకుని ఈ నూనెను జుట్టు రాసుకోవాలి. అప్పుడప్పుడు రాయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. కొబ్బరినూనెలో గోరింటాకు చూర్ణాన్ని వేసి మరిగించి చల్లారిన తరువాత ఆ నూనె వడగట్టాలి. ఆ నూనెను వారానికి మూడు సార్లు తలకు రాస్తే మంచి ఫలితం ఉంటుంది. ఒక బౌల్‌లో కొంచెం పెరుగు తీసుకుని అందులో ఒక టేబుల్‌ స్పూన్‌ పుదీన పొడి, ఆలివ్‌ ఆయిల్‌ను కలిపి ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేస్తే మంచి గుణముంటుంది.
కొబ్బరినూనె, ఆల్మండ్‌ నూనెను మిక్స్‌ చేసి జుట్టుకు పట్టిస్తే ఆరోగ్యమన జుట్టు సొంతమవుతుంది. ఆలివ్‌ ఆయిల్‌లో నిమ్మరసం కలిపి జుట్టుకు పట్టిస్తే జుట్టు రాలడం తగ్గడమే గాక చుండ్రు సమస్య కూడా తీరుతుంది. మరి మీరు ప్రయత్నిస్తారా.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/