మెరిసే కురులు

శిరోజాల సంరక్షణ

Hair Care Tips
Hair Care Tips

కాసిన్ని నీళ్లలో షాంపూను కలిపి తలస్నానం చేయడం మనకు తెలిసిందే. ఒక్క నీళ్లు మాత్రమే కాకండా రోజ్‌వాటర్‌, ఎసెన్షియల్‌ ఆయిల్‌, నిమ్మరసం, తేనె, కలబంద గుజ్జు కలపవచ్చు. అలా చేయడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.

రోజ్‌వాటర్‌లో షాంపూను కలిపి తలస్నానం చేస్తే మాడు దురద రాదు. అంతేకాదు జుట్టు మెత్తగా, పట్టుకుచ్చులా మెరుస్తుంది. షాంపూలో కాస్త ఎసెన్షియల్‌ ఆయిల్‌ను కలపాలి. ఇలా చేయడం వల్ల జుట్టు ఊడడం తగ్గడమే కాకుండా పెరుగుతుంది కూడా.

జుట్టు జీవం కోల్పోయి నిర్జీవంగా కనిపి స్తుంటే షాంపూలో నిమ్మరసం కలిపి వాడితే వెంట్రుకలు నిగనిగ లాడుతూ పట్టుకుచ్చులా మెరుస్తాయి. షాంపూలో కాస్త తేనె కలిపితే జుట్టు పొడిబారిపోకుండా తేమగా ఉంటుంది. తేనె మాడును ఆరోగ్యవంతంగా చేస్తుంది.

షాంపూలో కొంచెం కలబంద రసాన్ని కలిపితే మెంట్రుకలు శుభ్రపడి తళతళలాడుతాయి. జుట్టు పొడిబారకుండా ఉంటుంది. దురదలు ఉండవు. చుండ్రు తగ్గిపోతుంది. ఇది వెంట్రుకల పెరుగుదలకూ తోడ్పడు తుంది.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/