శిరోజాల ఆరోగ్యానికి స్క్రబ్బింగ్

అందమే ఆనందం

వేడి .. చర్మం పైనే కాదు , మాడుపైనా ప్రభావం చూపుతుంది. చర్మం పేలుసిబారి చుండ్రు సమస్య మొదలవుతుంది.. దురదతో పాటు జుట్టు రాలే సమస్యకు ఇది దారి తీస్తుంది.. దీన్ని నిరోధించాలంటే మాడును ఆరోగ్యంగా ఉంచుకోవాలని నిపుణులు అంటున్నారు..

Hair Care Tips
Hair Care Tips

కాఫీ పొడితో:

తలా స్నానానికి అరగంట ముందు గోరు వెచ్చని కొబ్బరి నూనె తో తలకు మర్దనా చేసుకోవాలి.. చెంచా కాఫీ పొడిని రెండు చెంచాల ఆలివ్ నూనె కలిపినా మిశ్రమాన్ని మాడుకు పట్టించాలి.. 20 నిముషాలు ఆరనిచ్చి గోరువెచ్చని నీటిని తలపై చిలకరించి ముని వేళ్ళతో మృదువుగా రుద్దాలి.. దీంతో మాడుపై మృతకణాలు దూరమై , చర్మంలో రక్త ప్రసరణ మెరుగవుతుంది.. శిరోజాలనూ రాలనివ్వదు..

దాల్చిన చెక్కతో ..

చెంచా వంటసోడాలో అరచెంచా దాల్చిన చెక్క పొడి, రెన్డు చెంచాల ఆలివ్ నూనె వేసి బాగా కలపాలి.. జుట్టును చిన్న చిన్న పాయలుగా విడదీసి , తలస్నానం చేస్తే మృతకణాలు దూరమవుతాయి.. మాడు మృదువుగా మారి, చర్మ రంధ్రాలు శుభ్రపడి శిరోజాలకు తగిన రక్త ప్రసరణ జరుగుతుంది… చుండ్రు, దురద వంటి సమస్యలన్నీ మాయమవుతాయి..

చక్కెరతో:

మూడు చెంచాల చెక్కెరకు రెండు చెంచాల కొబ్బరి నూనె, రెండు మూడు చుక్కల టీ ట్రీ ఆయిల్ లేదా లావెండర్ నూనె కలపాలి.. ఈ మిశ్రమాన్ని మాడుకు పట్టించి మృదువుగా రుద్దాలి… పావుగంట తర్వాత రసాయనాలు లేని షాంపూతో తలస్నానం చేస్తే, మృతకణాలు తలఁగి మృదువుగా మార్చుతుంది..

ఆధ్యాత్మికం వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/devotional/