కురులకు షుగర్‌, రోజ్‌వాటర్‌..

శిరోజాల సంరక్షణ

Hair care
Hair care

ఒత్తిడి, కాలుష్యం కారణంగా బలహీనమైన కురులను దృఢంగా మార్పుకునేందుకు షాంపూ వాడతాం. అయితే వంటింట్లో లభించే చక్కె, తేనె, నిమ్మరసం లేదా రోజ్‌వాటర్‌ను షాంపూలో కొద్దిగా కలిపి తలస్నానం చేస్తే వెంట్రుకలు దృఢంగా, ఆరోగ్యంగా మారతాయి. అదెలాగంటే..
షుగర్‌: షాంపూ చక్కెర మిశ్రమం వెంట్రుకలకు మృదుత్వాన్ని, మెరపును ఇస్తుంది. మాడు మీద

మురికిని తొలగిస్తుంది. షాంపూలో టీ స్పూన్‌ షుగర్‌ వేసి బాగా కలిపి కేశాలకు నెమ్మదిగా మసాజ్‌ చేసుకోవాలి. తరువాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.

రోజ్‌వాటర్‌ : షాంపూలో కొద్ది రోజ్‌వాటర్‌ కలిపి తలస్నానం చేస్తే శిరోజాలు ఆరోగ్యంగా, వేగంగా పెరుగుతాయి. రోజ్‌వాటర్‌ మాడు పీహెచ్‌ను స్థిరంగా ఉంచి చుండ్రును వదిలిస్తుంది. దాంతో మాడు తాజాగా ఉంటుంది.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/