Auto Draft
మహిళలకు చిట్కాలు

జుట్టుకు కొబ్బరినూనె అప్లయి చేస్తే కేశాలు మృదువుగా ఉంటాయి.
కొబ్బరినూనె, నవ్వులు లేదా ఆలివ్ ఆయిల్ కలిపి వేడిచేసి మాడుకు, శిరోజాలకు పట్టించి వేడినీటిలో ముంచిన టవల్ తలకు చుట్టుకోవాలి.
ఐదు నిమిషాలుంచి, మరోమారు టవల్‌ను వేడినీటిలో ముంచిచుట్టుకుని కొద్ది నిమాషాలు ఉంచుకోవాలి.ఇలా చేయడం ద్వారా మాడు నూనెను బాగా గ్రహిస్తుంది.
పొడిగా, పేలవంగా జుట్టు ఉన్నట్లయితే ..
ఒక కప్పు తేనె, అరకప్పు ఆలివ్‌ఆయిల్ లేదా నవ్వుల నూనె, రెండు టేబుల్ స్పూన్లు నిమ్మరసం కలిపి ఓ రాత్రంతగా ఉంచేసి కొద్దిగా తీసుకుని తలకు మసాజ్ చేయాలి.
వేడి టవల్ చుట్టుకుని కొద్దిసేపు షాంపూ చేసుకోవాలి.
జుట్టు పొడిగా దెబ్బ తిని ఉన్నట్లయితే ఒక టీ స్పూన్ ఆముదం, రెండు స్పూన్లు స్వచ్ఛమైన ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనెను కలిపి మసాజ్ చేసుకుని వేడినీటి టవల్ చుట్టి ఆ పై స్నానం చేయాలి.
తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/