మక్కీ అధిపతి అబ్దుల్‌ రహమాన్‌ అరెస్ట్‌

Abdul Rehman Makki
Abdul Rehman Makki

లాహోర్‌: ముంబై ఉగ్రదాడి కరకుడు, జమాత్‌-ఉద్‌-దావా ఛీప్‌ హఫీజ్‌ సయిద్‌ బావమరిది అబ్దుల్‌ రహమాన్‌ మక్కీనీ పాకిస్థాన్‌ పోలీసులు అరెస్టు చేశారు. అయితే మక్కీని పబ్లిక్ ఆర్డర్ యాక్ట్ నిర్వహణ కింద అరెస్ట్ చేసినట్లు పంజాబ్ పోలీసులు తెలిపారు. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్) మార్గదర్శకాల ప్రకారం పాక్ ప్రభుత్వం తీసుకున్న చర్యలను అణచివేయడంలో భాగంగా విమర్శలు చేయడంతో మక్కీని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. జమాత్ఉద్దావా రాజకీయ, అంతర్జాతీయ వ్యవహారాల శాఖకు అబ్దుల్ రహమాన్ మక్కీ అధిపతిగా ఉండటంతోపాటు ఫలాయీఇన్సానియత్ ఫౌండేషన్ (ఎఫ్‌ఐఎఫ్)కు ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు.


మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/