జీవీఎల్‌ ప్రజలకు క్షమాపణ చెప్పాలి

రాజధానిని విశాఖకు తరలిస్తే..అమరావతిలో కట్టిన భవనాల పరిస్థితి ఎమిటి?

vadde sobhanadreeswara rao
vadde sobhanadreeswara rao

అమరావతి: రాజధానిని విశాఖకు తరలిస్తే.. అమరావతిలో కట్టిన భవనాలు పరిస్థితి ఏంటని మాజీ మంత్రి వడ్డె శోభనాద్రీశ్వరరావు ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్‌కు ఒకరు చెబితే వినే స్వభావం లేదని విమర్శించారు. అమరావతి నుంచి రాజధాని తరలింపును బిజెపి అడ్డుకుంటుందని కన్నా చెప్పారన్నారు. బిజెపి సమావేశంలో రాజధానిగా అమరావతి ఉండాలని జీవీఎల్ చెప్పారని.. ఇప్పుడు రాజధాని రాష్ట్రాల పరిధిలోని అంశమని, కేంద్రానికి సంబంధం లేదని జీవీఎల్‌ చెబుతు న్నారని వడ్డె శోభనాద్రీశ్వరరావు అన్నారు. అసలు జీవీఎల్.. రాజ్యాంగం చదివారా? అని ప్రశ్నించారు. అమరావతి.. ఐదు కోట్ల మందికి సంబంధించిన విషయమని, కేంద్రం జోక్యం చేసుకోబోదని జీవీఎల్ ఎలా చెబుతారన్నారు. జీవీఎల్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని వడ్డె శోభనాద్రీశ్వరరావు డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఆమోదించిన చట్టానికి విరుద్ధంగా ఉన్న రాష్ట్ర చట్టం చెల్లదని, రాజధానిపై జోక్యం చేసుకునే హక్కు కేంద్రానికి ఉందని వడ్డె శోభనాద్రీశ్వరరావు అభిప్రాయం వ్యక్తం చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/