పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ గా నిలబడ్డ బిజెపి..

పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ గా నిలబడ్డ బిజెపి..

సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ ప్రీ రిలీజ్ వేడుక లో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. సినిమా ఫంక్షన్ ను కాస్త జనసేన సభ గా మార్చారని సినీ పెద్దలు సైతం మండిపడుతున్నారు. వైసీపీ నేతల ఫై , ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫై పవన్ చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. ప్రస్తుతం వైసీపీ vs పవన్ కళ్యాణ్ వార్ నడుస్తుంది. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ కు బీజేపీ సపోర్ట్ గా నిలిచింది. బీజేపీ పార్టీ తరఫున జీవీఎల్‌ నరసింహ స్పందిస్తూ వైసీపీ ఫై మండిపడ్డారు.

జనసేన అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ గారి పై వైసీపీ నాయకుల దుర్భాషలను ఖండిస్తున్నానని స్పష్టం చేశారు జివిఎల్ నరసింహ. విమర్శ తట్టుకొనే సహనం, సమాధానం చెప్పే బాధ్యత అధికార పార్టీకి ఉండాలని చురకలు అంటించారు. “నువ్వు ఒకటంటే నేను వంద అంటాను అనే అహంకార తీరు రాజకీయ పతనానికి సూచకం. తిట్ల తుఫానుకు తెరదించి గులాబ్ తుఫానుపై వైసీపీ శ్రద్ధ పెట్టాలి.” అంటూ ఫైర్‌ అయ్యారు జివిఎల్ నరసింహ. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు. గత కొద్దీ రోజులుగా పవన్ కళ్యాణ్..బిజెపి తో కటీఫ్ అవుతారనే వార్తలు ప్రచారం జరుగుతున్న సమయంలో బీజేపీ ఇప్పుడు పవన్ కు సపోర్ట్ గా నిలువడం పవన్ అభిమానుల్లో కాస్త ధైర్యం నింపుతుంది.

జనసేన అధ్యక్షులు @PawanKalyan గారిపై వైసీపీ నాయకుల దుర్భాషలను ఖండిస్తున్నాను. విమర్శ తట్టుకొనే సహనం, సమాధానం చెప్పే బాధ్యత అధికార పార్టీకి ఉండాలి. నువ్వు ఒకటంటే నేను వంద అంటాను అనే అహంకార తీరు రాజకీయ పతనానికి సూచకం. తిట్ల తుఫానుకు తెరదించి గులాబ్ తుఫానుపై వైసీపీ శ్రద్ధ పెట్టాలి.— GVL Narasimha Rao (@GVLNRAO) September 28, 2021