నారా లోకేశ్ పాదయాత్రపై జీవీఎల్ కామెంట్స్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి , చంద్రబాబు తనయుడు నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాదయాత్ర ఫై వైస్సార్సీపీ నేతలు పలు విమర్శలు చేస్తుండగా..తాజాగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. లోకేష్ పాదయాత్రపై పాజిటివ్ న్యూస్ కంటే నెగెటివ్ వార్తలే ఎక్కువగా వస్తున్నాయని అన్నారు.

నాయకత్వం అనేది స్వయంగా ప్రకాశించాలని, బలవంతంగా రుద్దుడు కార్యక్రమంతో నాయకత్వం అభివృద్ది చెందదని జీవీఎల్ అభిప్రాయపడ్డారు. ఎక్కడైనా అంతిమ నిర్ణేతలు ప్రజలేనని, వారే తేల్చుతారని స్పష్టం చేశారు. లోకేశ్ పాదయాత్ర స్థానికంగా కూడా సంచలనాత్మక రీతిలో సాగుతున్నట్టు అనిపించడంలేదని చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటె నేడు నారా లోకేష్ యువగళం పాదయాత్ర పూతలపట్టు నియోజకవర్గంలో కొనసాగుతుంది. ఈ సందర్బంగా లోకేష్ కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయాన్ని సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలోని అర్చకులు లోకేశ్ కు వేదాశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందించారు.