16 నుండి గరుకుల జూనియర్‌ లెక్చరర్‌ ఇంటర్వ్యూలు

Gurukula JL Interview
Gurukula JL Interview

హైదరాబాద్‌: రాష్ట్రంలోని గురుకులాల్లోని వివిధ జూనియర్ లెక్చరర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఇంగ్లిష్, తెలుగు, మ్యాథమెటిక్స్, కామర్స్, హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ సబ్జెక్టులకు లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. ఈ నెల 16 నుంచి టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో ఇంటర్వ్యూలు జరుగుతాయని తెలిపింది. అభ్యర్థులు ఈ నెల 9వ తేదీ నుంచి జోనల్ ప్రిఫరెన్స్ వెబ్‌ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించింది. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు వెబ్‌సైట్లో పేర్కొన్న సంబంధిత మార్గదర్శకాలను తప్పనిసరిగా అనుసరించాలని కోరింది.


మరిన్ని తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌చేయండి:https://www.vaartha.com/specials/career/