గుంటూరు సినిమా థియేటర్లలో జెసి ఆకస్మిక తనిఖీ

కోవిడ్‌ నిబంధనలు పాటించకపోవటంతో ఆగ్రహం

JC random inspection at Guntur movie theaters
JC random inspection at Guntur movie theaters

Guntur: సినిమా థియేటర్లలో కోవిడ్‌-19 నిబంధనలను కచ్చితంగా పాటించాలని గుంటూరు జిల్లా జెసి దినేష్‌కుమార్‌ థియేటర్ల నిర్వాహకులను ఆదేశించారు..

మంగళవారం గుంటూరు సిటీలోని నాజ్‌ థియేటర్‌, డిమార్ట్‌ ప్రాంగణంలోని ఎస్‌పిఎల్‌ సినిమాస్‌ థియేటర్లను జెసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.. థియేటర్లలో కోవిడ్‌ నిబంధనలు సక్రమంగా అమలు చేయకపోవటం గమనించి నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తంచేశారు..

సినిమా థియేటర్లలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా అమలు చేయాల్సిన కోవిడ్‌-19 నిబంధనలపై ఇప్పటికే యాజమాన్యాలకు అవగాహన కల్పించటం జరిగిందన్నారు.

థియేటర్లలోని సీట్లలో 50శాతం మాత్రమే ప్రేక్షకులను అనుమతించాలని, ప్రతి రెండు సీట్ల మధ్య ఒక సీటు ఖాళీగా ఉంచాలన్నారు.. ఖాళీ సీట్లలో కూర్చోకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.. సినిమాహాలులోకి ప్రవేశించిన ప్రతిఒక్కరూ మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని తరచూ చేతులు శానిటైజేషన్‌ చేసుకునేలా ఏర్పాటు చేయాలన్నారు..

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/