టిడిపి కి పట్టిన గతే పడుతుంది : జగదీశ్‌రెడ్డి

హైదరబాద్ : అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాని కాంగ్రెస్ నేతలు మళ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో నిలబడ్డారని తెలంగాణ మంత్రి జగదీశ్‌రెడ్డి ఎద్దేవా చేశారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఉత్తమ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకపోవడానికి కారణం, లోక్‌సభ ఎన్నికల్లో విజయంపై నమ్మకం లేకనేనని సెటైర్ వేశారు. టిడిపి కి పట్టిన గతే భవిష్యత్‌లో కాంగ్రెస్‌కు కూడా పడుతుందని జగదీశ్‌రెడ్డి హెచ్చరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telengana/