గులాబ్..అల్లకల్లోలం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గులాబ్ తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉంది. ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో తీరాన్ని తాకిన గులాబ్‌. 11 గంటలకు పూర్తిగా తీరాన్ని దాటింది. శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నం, ఒడిషాలోని గోపాల్‌పూర్‌ మధ్య తుఫాను కేంద్రం తీరాన్ని దాటినట్లు అధికారులు ప్రకటించారు. దాదాపు వంద కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి.

శ్రీకాకుళం నగరంలో విద్యుత్ పూర్తిగా నిలిచిపోయింది. అన్ని శాఖలు తక్షణం పునరుద్ధరణ చర్యలు చేపట్టాయి. యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించాం. తుఫాన్ ప్రభావం పూర్తిగా తొలగిపోయే వరకు యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలి. జాతీయ విపత్తు నివారణ బృందాలు, రాష్ట్ర విపత్తు నివారణ బృందాలు పనిచేస్తున్నాయి” అని కలెక్టర్ చెప్పారు. గుంటూరు, విజయవాడ నగరాల్లో ఉదయం నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తోంది.

ఇక ‘గులాబ్’ తుఫాన్ ప్రభావంతో హైదరాబాద్‎లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. వర్షం తో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ప్రధాన రహదారులకు వరద పోటెత్తడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గులాబ్‌ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో సోమవారం, మంగళవారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండేలా అధికారుల చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. తుఫాన్ నేపథ్యంలో హైదరాబాద్‌లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసింది. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు కంట్రోల్‌ రూమ్ 040-23202813 నంబర్లకు ఫిర్యాదు చేయాలని సూచించారు. హైదరాబాద్‎తో పాటు రాష్ట్రంలో పలు చోట్ల వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. మూడు రోజుల పాటు రెడ్ అలెర్ట్ ఏరియాలో బడులకు సెలవులు ఇవ్వాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.