గుజరాత్ పోర్టుల్లో హైఅలర్ట్

Gujarat-port
Gujarat-port

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దుతో పాకిస్థాన్ రగిలిపోతోంది. ఏదో విధంగా భారత్ లో విధ్వంసం సృష్టించేందుకు యత్నిస్తోంది. సరిహద్దుల గుండా టెర్రరిస్టులను చొప్పించేందుకు విశ్వప్రయత్నం చేస్తోంది. దీనికి తోడు మరో దుస్సాహసానికి పూనుకుంది. తమ కమెండోలను భారత భూభాగంలోకి చొప్పించేందుకు యత్నిస్తోంది. సముద్ర మార్గం గుండా కచ్ ఏరియాలోకి పాక్ కమెండోలు చొరబడేందుకు యత్నిస్తున్నారనే విషయాన్ని ఇంటెలిజెన్స్ గుర్తించింది. ఈ నేపథ్యంలో, గుజరాత్ లోని అన్ని పోర్టుల్లో హైఅలర్ట్ ప్రకటించారు.

ఈ క్రమంలో, అదానీ పోర్ట్స్ సెజ్ ఓ ప్రకటనను వెలువరించింది. గల్ఫ్ ఆఫ్ కచ్ లోకి పాకిస్థాన్ కమెండోలు ప్రవేశించారనే సమాచారం కోస్ట్ గార్డ్ స్టేషన్ నుంచి తమకు వచ్చిందని ప్రకటనలో తెలిపింది. హరామీ నాలా జలాల గుండా వారు ప్రవేశించారని… అండర్ వాటర్ దాడుల్లో వారు శిక్షణ పొందారనే సమాచారం ఉందని వెల్లడించింది. ముంద్రా పోర్టులోని అన్ని నౌకల పట్ల కట్టుదిట్టమైన భద్రతా చర్యలను తీసుకోవాలని సూచించినట్టు తెలిపింది. నిఘాను ముమ్మరం చేయాలని సూచించినట్టు చెప్పింది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/