గుజరాత్‌ గ్యాస్‌, ఐబి హౌసింగ్‌ జోష్‌

GUJARAT GAS
GUJARAT GAS

న్యూఢిల్లీ,: సిజిడి నెట్‌వర్క్‌ విస్తరణకు పిఎన్‌జిఆర్‌బి నుంచి ఆమోదం లభించినట్లు గుజరాత్‌ గ్యాస్‌ తెలిపింది. దీనిలో భాగంగా పంజాబ్‌లోని సిర్సా, ఫతేబాద్‌, మన్సా జిల్లాలతోపాటు, మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ, దేవాస్‌, ఇండోర్‌ జిల్లాలోనూ సిజిడి నెట్‌వర్క్‌ను విస్తరించనున్నట్లు తెలిపింది. ఈ దారిలోనే జబువా, బన్స్వారా, రత్లాం, ఫిరోజ్‌పూర్‌, ఫరీద్‌కోట్‌ తదితర పలు ప్రాంతాలలో సిజిడి అభివృద్ధికి వీలు ఏర్పడినట్లు తెలియచేసింది. దీంతో ఈ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఇలో 3.5శాతం పెరిగి రూ.151 వద్ద ట్రేడవుతోంది. మొదట రూ.155వరకూ ర్యాలీతీసింది. అదేవిధంగా ఐబి హౌసింగ్‌ ఫైనాన్స్‌ కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.26వేల కోట్ల మేర రుణాలను సమీకరించాలని భావిస్తున్నట్లు ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ తెలిపింది. బాండ్లు, బ్యాంకు రుణాలు, సెక్యూరిటైజేషన్‌ తదితర మార్గాల ద్వారా నిధుల సమీకరణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. తద్వారా బిజినెస్‌ను పెంచుకునే ప్రణాళికల్లో ఉన్నట్లు కంపెనీ తెలియచేసింది. రుణాల మంజూరీని మెరుగుపరచుకోవడం ద్వారా నికర లాభాల్లో 17నుంచి 19 శాతం వృద్ధిని సాధించాలని చూస్తున్నట్లు వివరించింది. దీంతో ఈ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఇలో 2.2శాతం పెరిగి రూ.888వద్ద కదులుతోంది. కంపెనీలో ప్రమోటర్లకు 21.67శాతం వాటా ఉంది.


మరిన్నీ తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి : https://www.vaartha.com/news/business/