గుజ‌రాత్ సీఎం విజ‌య్ రూపానీ రాజీనామా

అహ్మ‌దాబాద్‌: గుజరాత్ సీఎం విజ‌య్ రూపానీ రాజీనామా చేశారు. ఈ మేర‌కు ఆయ‌న గ‌వ‌ర్న‌ర్‌కు త‌న రాజీనామా లేఖ‌ను స‌మ‌ర్పించారు. విజ‌య్ రూపానీ 2016 నుంచి గుజ‌రాత్ సీఎంగా కొన‌సాగుతున్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు కేవ‌లం ఏడాది మాత్ర‌మే గ‌డువు ఉండ‌గా విజ‌య్ రూపానీ రాజీనామా చేయ‌డాన్ని బ‌ట్టి చూస్తుంటే.. బీజేపీ కొత్త ముఖ్య‌మంత్రి నేతృత్వంలో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తున్న‌ది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/