విద్యా సంస్థలను ప్రారంభించేందుకు అవసరమైన మార్గదర్శకాలు

అధికారులతో విద్యాశాఖ మంత్రి సబిత సమీక్ష

TS Minister Sabitaindra Reddy
TS Minister Sabitaindra Reddy

Hyderabad: రాష్ట్రంలోని ప్రభుత్వ, పైవేట్‌ విద్యా సంస్థలను ప్రారంభించేందుకు అవసరమైన మార్గదర్శకాలను వెంటనే రూపొందించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు . కరోనా నిబంధనలకు అనుగుణంగా మార్గదర్శకాలు రెడీ చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.

ఫిబ్రవరి 1వ తేదీ నుంచి విద్యాసంస్థలు ప్రారంభించాలన్న సీఎం ఆదేశాలతో విద్యాశాఖ అధికారులతో మంత్రి సవిూక్ష జరిపారు. అధికారులు, ఉపాధ్యాయులు, పైవేట్‌ యాజమాన్యాలు పూర్తిస్థాయిలో ఈ నెల 25 నాటికి సిద్ధం కావాలని సూచించారు.

నైన్త్‌, టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ, ఇతర వృత్తి విద్యా కోర్సుల తరగతులను ఏ విధంగా నిర్వహించాలనే దానిపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలన్నారు. ఈమేరకు 20లోగా ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని కోరారు.   ఈ నెల 19న పైవేట్‌ పాఠశాలలు, కళాశాలలు, వృత్తి విద్యా కోర్సుల యాజమాన్య కమిటీలతో సమావేశమవుతామన్నారు

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/