అతిథి సేవ స్వర్గానికి తోవ

ఆధ్యాత్మిక చింతన

to heaven
to heaven

ఇది పురాణంలో ఓ కథ.. అడవిలో పిట్టలు పట్ట అమ్మి పొట్ట పోసుకునే ఓ మనిషి ఉండేవాడు. అతను వెదురు కర్రకు బంకపూసి, చెట్లుమీద ఉన్న పిట్టల్ని పట్టేవాడు.

చలికాలం మంచు కురుస్తుంది. ఆ సమయంలో అతను పిట్టలు పట్టటానికి అడవికి వెళ్తాడు. ఓ పిట్ట కూడా దొరకలేదు. ఆ రోజు అడవి అంతా గాలించాడు. పొద్దుగూకింది. అడవిలో చాలా దూరం వచ్చినందువల్ల దారితప్పాడు. చీకటి పడింది. చలాగాలులు వీస్తున్నాయి.

నెమ్మదిగా ఓ చెట్టుకిందకు నడిచాడు. చలికిగడవణికిస్తుంది. పిట్టలు పట్టేవానివద్ద కప్పుకోటానికి బట్టలు లేవు. గాలి రివ్వురివ్వున వీస్తుంది. చలికి గడగడవణుకుతున్నాడు పాపం.

అతను ఓ చెట్టు కింద కూర్చున్నాడు. అయితే ఆ చెట్టుమీద ఓ పావురాల జంట గూడుకట్టు కొని కాపురం చేస్తుంది.

పిట్టలుపట్టేవాని దురవస్థను చూసి మగపావురం ఆడ పావురంతో ఇలా అంది. ‘ఈ మనిషి మనకి శత్రువు. నిజమేకానీ, ఈ రోజు మనకు అతిధిగావచ్చి అతిథి దేవునితో సమానం.

అతన్ని ఆదరించటం మన కర్తవ్యం. చలి మరింత పెరిగింది. అతను రాత్రంతా ఇలానే ఉన్న చలితట్టుకోలేక నిపోవడం ఖాయం. అతను చనిపోతే ఆ పాపం మనకు అటుకుంటుంది.

మనం ఇప్పుడు అతన్ని చలినుండి కాపాడాలి. పావురాలు తాము కష్టపడి కట్టుకున్న గూటిని కింద పడేశాయి. చిన్నచిన్న కట్టెపుల్లల్ని ముక్కులతో కరచి కిందజారవిడిచాయి. మగ పావురం ఎగిరిపోయింది.

ఎక్కడి నుంచో మండుతున్న కొరివిని తెచ్చి పుల్లల మీద పడేసింది. కట్టెలు రగులుకొని మండసాగాయి. పిట్టలు పట్టెవాడు ఇంకొన్ని కట్టెల్ని మంటలో వేశాడు.

అలా చలినుంచి బయట పడ్డాడు. ఉదయం నుంచి తిండిలేదు. బాగా ఆకలి వేస్తుంది.

మంట వెలుగు లోనే తింనటానికి ఏమైన దొరుకుతుందేమో అని అటూ ఇటూ చూశాడు. అతను ఆకలిలో అల్లాడి పోతున్నాడు.

ఇదంతా చూసిన ఆడ పావురం. మగపావురంతో ఇలా అంది. ‘అతిథి సాక్షాత్తూ భగవంతుని స్వరూపుడు. ఇంటికి వచ్చిన అతిథికి ఆకలి దప్పులు తీర్చకపోతే వాల్లకు పాపం వస్తుంది.

ఈ రోజు మన అతిథి. పాపం ఆకలితో బాధపడుతున్నాడు. ఇతని ఆకలి తీర్చడానికి మన వద్ద ఏముంది? నేను నిప్పుల్లో దూకుతాను.

అప్పడు అతను నా మాంసం తిని ఆకలితీర్చుకుంటాడు. ఈ మాటలు అంటూ ఆడపావురం చెట్ముఈద నుంచి గభాలున నిప్పుల్లో దూకింది. అప్పుడు మగపావురం ఇలా అనుకుంది.
ఈ కొద్దిపాటి మాంసంతో ఈ అతిథికి తీరుతుందా?

నేను కూడా మంటల్లో పడి నా మాంసం కూడా ఇతనికి ఇస్తాను. మరుక్షణం మగపావురం మంటల్లోకి దూకింది. ఆ కాశంలో దుందుభులు మోగాయి. పూలవాన కురిసింది.

దేవవిమానం పైనుంచి కిందకుదిగింది. రెండు పావురాలు దైవరూపాలు ధరించి దివ్యలోకాలకు వెళ్లి పోయినవి.

గొప్పగొప్ప యజ్ఞాయగాలు చేసే వారికి, కఠోర తపస్సు చేసేవారికి మహర్షు లకు కానీ ఆభా గ్యం కలుగదు. అతిథిసేవ స్వర్గానికి తోవ.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/