గూడూరు-విజయవాడ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభo

Vice President M.Venkaiah Naidu
Vice President M.Venkaiah Naidu

Nellore: గూడూరు-విజయవాడ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇంటర్‌సిటీ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు. ప్రతి రోజూ గూడూరు నుంచి ఉదయం 6.10 గంటలకు రైలు బయలుదేరనుంది. ఉదయం 10.40 గంటలకు సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ విజయవాడ చేరుకోనుంది. రోజూ సాయంత్రం 6 గంటలకు విజయవాడలో రైలు బయలుదేరనుంది. రాత్రి 10.30 గంటలకు గూడూరు చేరుకోనుంది. రైలులో 2 ఏసీ చైర్‌కార్లు, 10 సెకండ్‌ క్లాస్‌ చైర్‌ కార్లు సహా 14 బోగీలు ఉన్నాయి.