డయాబెటిస్‌ కట్టడికి జామకాయ దివ్యౌషధం

ఈ రోజుల్లో మనం తినే ఆహారంలో చాలా వరకూ కమర్షియల్‌ ఫుడ్డే ఎక్కువగా ఉంటోంది. అందువల్లే చాలా వరకు అనారోగ్యం పాలవుతుంటాము. మనలో చాలా మంది డయాబెటిస్‌తో ఇబ్బంది పడుతుంటారు. మన బాడీలోని పాంక్రియాస్‌ నుంచి ఇన్సులిన్‌ ఉత్పత్తి అవుతుంది. బ్లడ్‌లో షుగర్‌ లెవెల్స్‌ సరిగ్గా ఉండేలా ఇన్సులిన్‌ చేస్తుంది.

డయాబెటిస్‌ కట్టడికి జామకాయ దివ్యౌషధం
GUAVA FRUIT

అయితే మన బాడీలో షుగర్‌ ఎక్కువైతే ఇన్సులిన్‌ ఉత్పత్తి తగ్గిపోతుంది. అప్పుడు బ్లడ్‌లో షుగర్‌ లెవెల్స్‌ మరింత పెరిగిపోతాయి. వాటిని కంట్రోల్‌ చేయడానికి ఇంజెక్షన్ల ద్వారా ఇన్సులిన్‌ను శరీరంలోకి ఎక్కించుకోవాల్సి వస్తుంది. ఇది సింపుల్‌గా డయాబెటిస్‌ అంటే. ఈ వ్యాధి ఉన్నవారికి ఇన్సులిన్‌ సరిగ్గా ఉత్పత్తి కాదు. అందువల్ల వాళ్లు పడే బాధలు అన్నీ ఇన్నీ కావు. అందుకే మనం షుగర్‌ ఉండే పదార్థాలు ఎక్కువగా తినకూడదు.

మనం తినే అన్నంలో కూడా షుగర్‌ ఉంటుంది. అందువల్ల బ్యాలెన్స్‌డ్‌ ఫుడ్‌ తింటే ఇన్సులిన్‌ ఉత్పత్తి అవుతూ ఉంటుంది. డయాబెటిస్‌ సమస్య కూడా రాదు. డయాబెటిస్‌ లేకపోతే సంతోషం. అదే ఉంటే దాన్ని కంట్రోల్‌లో ఉంచుకోవాల్సిందే. అందుకు జామకాయలు బాగా ఉపయోగపడతాయి. యేడాదంతా కాసే జామకాయలు చలికాలంలో ఎక్కువగా వస్తాయి.

డయాబెటిస్‌ కట్టడికి జామకాయ దివ్యౌషధం
GUAVA FRUIT

ఇంతకీ జామకాయలు డయాబెటిస్‌ను ఎలా కంట్రోల్‌ చేస్తాయి అనుకుంటున్నారా?

జామకాయలో తక్కువ స్థాయి గ్లికామిక్‌ ఇండెక్స్‌ ఉంటుంది. అందువల్ల జామకాయలు త్వరగా జీర్ణం కావు. ఫలితంగా రక్తంలో గ్లూకోజ్‌ లెవెల్స్‌ ఒక్కసారిగా పెరిగిపోకుండా ఉంటాయి. అందువల్ల షుగర్‌ పేషెంట్లకు ఇవి సరైన ఆహారం.

జామకాయల్లో ఫైబర్‌ (పీచు పదార్థం) ఎక్కువ. ఇది బ్లడ్‌లో షుగర్‌ లెవెల్స్‌ని చెక్‌ చేసి సరిగా ఉంచుతుంది. ఫైబర్‌ కూడా ఆలస్యంగా జీర్ణమయేదే. జామకాయలో కేలరీలు తక్కువ. అందువల్ల బరువు తగ్గాలనుకునే వారు జామ తినవచ్చు. అధిక బరువు కూడా బ్లడ్‌లో షుగర్‌ లెవెల్స్‌ని పెంచుతుంది. 100 గ్రాముల జామలో 68 కేలరీలుంటాయి. అలాగే షుగర్‌ 8.92 శాతమే ఉంటుంది. జామలో సోడియం తక్కువ. పొటాషియం ఎక్కువ. డయాబెటిస్‌ని కంట్రోల్‌లో ఉంచడానికి ఇవి రెండు అవసరమే.

డయాబెటిస్‌ కట్టడికి జామకాయ దివ్యౌషధం
GUAVA FRUIT

విటమిన్‌ సి ..కమలాపండులో కంటే జామలో నాలుగు రెట్లు అధికంగా ఉంటుంది. ఇది మన బాడీలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది కూడా డయాబెటిస్‌ ఉన్నవారికి అత్యవసరం. జామలో ఇంకా చాలా గుణాలున్నాయి. విటమిన్స్‌, మినరల్స్‌ లభిస్తాయి. జామకాయను డైరెక్టుగా తినవచ్చు. లేదా జ్యూస్‌ చేసుకుని తాగవచ్చు. అయితే మార్కెట్లలో జామ జ్యూస్‌ టెట్రా ప్యాకెట్లు లభిస్తున్నాయి. అవి మాత్రం తాగవద్దు. వాటిలో జామ జ్యూస్‌ ఉండేది 12 శాతమే. మిగతాదంతా షుగర్‌, సింథటిక్‌ కలర్స్‌. అవి తిని అనారోగ్యాలు కొని తెచ్చుకునే బదులు జామకాయలు తినడం మేలు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/