రోగనిరోధక శక్తికి జామ

GUAVA

జామకాయల్ని చాలా మంది ఇష్టపడతారు. జామ పలురకాల పోషకాలకు నిలయం. వీటిలో రోగనిరోధకశక్తిని పెంచే విటమిన్లు అధికం. జామలో చక్కెరశాతం ఇతర పండ్లకంటే తక్కువ. కాబట్టి మధుమేహం ఉన్నవారూ కూడా తీసుకోవచ్చు. ఇందులో ఉండే పెక్టిన్‌ అనే పీచుపదార్థం జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ పీచుపదార్థం ఆకలిని తగ్గిస్తుంది. దాని వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. ఈ పండులో అధికంగా ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడానికి, మూత్రపిండాల ఆరోగ్యానికి ఎంతో మంచిది. జామకాయలోని ఆంథోసయానిన్లు అనే యాంటి ఆక్సిడెంట్లు చర్మ సంరక్షణకు కూడా దోహదపడతాయి. పచ్చిజామలో ఈ ఆంథోసయానిన్లు ఎక్కువగా, పిండిపదార్థాలు తక్కువగా ఉండడం చేత రక్తంలో చక్కెర పరిమాణాన్ని నియంత్రించగలవు. అయితే పచ్చిజామలోని వగరు వల్ల కావచ్చు. అధికంగా ఉండే పెక్టిన్‌ వల్ల కావచ్చు కొంతమందికి వీటిని తింటే వెంటనే దగ్గు వస్తుంది. దోరగా పండిన జామకాయలు తింటే దగ్గు బెడద ఉండదు. అదికొద్దిమందికి మాత్రం కొన్ని రకాల పదార్థాలు పడకపోవచ్చు. తిన్నాక ఇబ్బంది అనిపించవచ్చు. వైద్యపరీక్షల ద్వారా ఆ కారణాలు తెలుస్తాయి.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/