నవంబర్‌లో అత్యధికంగా జిఎస్‌టి ఆదాయం

Goods and Services Tax
Goods and Services Tax

ఢిల్లీ: నవంబర్‌ నెలలో వస్తుసేవల పన్ను(జిఎస్‌టి) రెవెన్యూ రూ. లక్ష కోట్లు దాటాయి. దీంతో నవంబర్‌ నెల సరికొత్త రికార్డు లక్ష కోట్ల మార్క్‌ను దాటింది. అయితే గత మూడు నెలలుగా చూసుకుంటే జిఎస్‌టి లక్ష కోట్ల మార్క్‌ను దాటకపోవడం గమనార్హం. కాగా నవంబర్‌ జిఎస్‌టి వసూళ్లు రూ. 1,03,492 కోట్లుగా ఉన్నాయి. ఇందులో సిజిఎస్‌టి రూ. 19,592 కోట్లు, ఎస్‌జిఎస్‌టి రూ. 27,144 కోట్లు, ఐజిఎస్‌టి కలెక్షన్లు రూ.49,028 కోట్లుగా వసూళ్లు కాగా సెస్‌ రూపంలో 7,727 కోట్లు వచ్చాయి. రెండు నెలల వృద్ధిరేటు తగ్గు ముఖం పట్టినప్పటికీ, గత నెలలో మాత్రం జిఎస్‌టి వృద్ధిరేటు ఆశాజనకంగా మారింది. ఈ లక్ష కోట్ల మార్క్‌తో ఈ ఏడాది వృద్ధిరేటు 12 శాతానికి పెరిగింది. కాగా ఈ ఏడాదిలో ఇదే అత్యధిక వృద్ధిరేటు కావడం విశేషం కూడా.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/