జీఎస్టీ మండలి సమావేశం కీలక నిర్ణయాలు

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆచితూచి నిర్ణయాలు

న్యూఢిల్లీ : నేడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను నిర్మలా సీతారామన్ మీడియాకు వెల్లడించారు. సింగిల్ అజెండాతో జీఎస్టీ మండలి సమావేశం జరిగిందని తెలిపారు. కరోనా ఔషధాలు, పరికరాలపై పన్నులు తగ్గించినట్టు చెప్పారు.

జీఎస్టీ మండలి నిర్ణయాలు…


బ్లాక్ ఫంగస్ చికిత్సలో వాడే ఆంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్లపై జీఎస్టీ మినహాయింపు.
ఆక్సిజన్ యూనిట్లు, టెస్టింగ్ కిట్లు, పల్స్ ఆక్సీమీటర్లపై జీఎస్టీ తగ్గింపు.
ఆక్సిజన్ ఉత్పత్తి యంత్రాలపై జీఎస్టీ తగ్గింపు.
కొవిడ్ చికిత్సలో ఉపయోగించే 3 రకాల మందులపై జీఎస్టీ తగ్గింపు.
వ్యాక్సిన్, టెంపరేచర్ కొలిచే పరికరాలపై 5 శాతం జీఎస్టీ యథాతథం.
అంబులెన్సులపై 12 శాతం జీఎస్టీ తగ్గింపు.
శ్మశాన వాటికల్లో వినియోగించే ఎలక్ట్రిక్ ఫర్నెస్ (విద్యుత్ ఆధారిత దహన వేదిక)లపై 5 శాతం జీఎఈస్టీ తగ్గింపు
హ్యాండ్ శానిటైజర్లపై జీఎస్టీ కుదింపు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/