మళ్లీ రూ. లక్ష కోట్లు దాటిన జీఎస్‌టీ వసూళ్లు

gst collection
gst collection

న్యూఢిల్లీ: జీఎస్‌టీ వసూళ్లు మళ్లీ రూ.లక్ష కోట్లు దాటాయి. గత ఏడాది డిసెంబర్‌ నెలలో జీఎస్‌టీ కింద రూ.1,08,184 కోట్లు వసూలయ్యాయి. 2018 డిసెంబరులో వసూలైన రూ.94,728 కోట్లతో పోలిస్తే ఇది 16 శాతం రూ.8274 కోట్లు ఎక్కువ. 2019లో జీఎస్‌టీ వసూళ్లు రూ.లక్ష కోట్లు దాటడం వరుసగా ఇది రెండో నెల గత ఏడాది నవంబర్‌ నెలలో జీఎస్‌టీ వసూళ్లు రూ.1,08,492 కోట్లకు చేరాయి. గత ఏడాది డిసెంబరు నెలలో వసూలైన రూ.1,08,184 కోట్ల జీఎస్‌టీ రూ.19,962 కోట్లు సీజీఎస్‌టీ రూ.26,792 కోట్లు ఎస్‌జీఎస్‌టీ రూ.48,099 కోట్లు ఐజీఎస్‌టీ రూ.8,331 కోట్లు సెస్సు ద్వారా వసూలయ్యాయి. జీఎస్‌టీ వసూళ్లు వరుసగా రెండు నెలలపాటు రూ.లక్ష కోట్లు దాటడంతో వినియోగ డిమాండ్‌ క్రమంగా గాడిన పడుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జీడీపీ వృద్ధి రేటు పడకేయాడానికి పెట్టుబడుతలోపాటు వినియోగ డిమాండ్‌ పడకేయడం ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో జీఎస్‌టీ వసూళ్లు వరుసగా రెండు నెలలు రూ. లక్ష కోట్లు దాటడం ప్రభుత్వానికి కొంత ఊరట ఇస్తోంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/