డిసెంబర్‌లో జిఎస్‌టి వసూళ్లు లక్ష కోట్లు

Goods and Services Tax
Goods and Services Tax

న్యూఢిల్లీ: గడిచిన సంవత్సరం డిసెంబరులో జిఎస్‌టి వసూళ్లు రూ. లక్ష కోట్లు దాటాయి. ఈ నెలలో రూ. 1.03 లక్షల కోట్ల మేర వసూళ్లను చేసింది. దాదాపు 6 శాతం వృద్ధిరేటును సాధించినట్లు అయింది. అయితే అదే మొత్తాన్ని గత నెలలో కూడా కొనసాగించడం గమనార్హం. సిజిఎస్‌టి వసూళ్లు రూ. 19,962 కోట్లు, ఎస్‌జిఎస్‌టి రూ. 26,792 కోట్లు, ఐజిఎస్‌టి రూ. 48,099 కోట్లు వసూలు చేశారు. అంతేకాదు గత నెలలో రూ.8,331 కోట్ల సుంకం వసూలైంది. సెప్టెంబర్‌ నెలలో జిఎస్‌టి వసూళ్లు దాదాపు 2.7 శాతం తగ్గగా, అక్టోబర్‌లో అవి 5.3 శాతానికి పడిపోయాయి. నవంబర్‌లో సిజిఎస్‌టి రూ. 19,592 కోట్లు, ఎస్‌జిఎస్‌టి రూ. 27,144 కోట్లు, ఐజిఎస్‌టి రూ. 49,028 కోట్లు, సెస్‌ రూపంలో రూ. 7,727 కోట్లు వసూలయ్యాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/