రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలు విడుదల చేయాలి

41వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం.. మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌

Harish Rao

హైదరాబాద్‌: వర్చువల్‌ విధానంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ ఆధ్వర్యంలో 41వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పాల్లొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు రాష్ట్ర ప్రతిపాదనలు, డిమాండ్లను వివరించారు. రాష్ట్రానికి రావాల్సిన రూ.2700 కోట్లను త్వరాగా విడుదల చేయాలని కోరారు. జీఎస్టీ పరిహారం కేంద్ర ప్రభుత్వమే చెల్లించాలన్నారు. రాష్ట్రానికి రావాల్సిన రూ.5,420 కోట్లు విడుదల చేయాలన్నారు. పరిహారంలో సెస్‌ మిగిలితే కన్సాలిడేట్‌ ఫండ్‌లో జమ చేసి కేంద్రం వాడుకుంటుందోని, సెస్‌ తగ్గినప్పుడు రాష్ట్రాలు అప్పుడు తీసుకోవాలనడం సరికాదన్నారు. ఐజీఎస్టీ సమావేశం వెంటనే నిర్వహించాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/