వినువీధిన భారత్‌ విజయకేతనం

GSLV Mark 3d2
GSLV Mark 3d2

వినువీధిన భారత్‌ విజయకేతనం

గగన తలంలోనికి ఉపగ్రహాన్ని విజయ వంతంగా పంపించడంద్వారా భారత్‌ శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం మరో అరుదైన గౌరవా న్ని దక్కించుకుంది. షార్‌నుంచి బుధవారం ప్రయోగించిన జిఎస్‌ఎల్‌వి మార్క్‌3 డి2 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించడంతో ఇస్రోశాస్త్రవేత్తలు మరోఅరుదైన విజయాన్ని మూటగట్టుకున్నారనే చెప్పాలి.ముందుగా గజ తుపాను ప్రభా వం శ్రీహరికోటపై ఉంటుందని, తీరం దాటుతుందన్న అంచ నాలతో వాయిదావేయాలని భావించినా గజ తుపాను ప్రభా వం ఎంతమాత్రం ఉండదన్న నిర్ధారణకు వచ్చినతర్వాత కౌంట్‌ డౌన్‌ను ప్రారంబించారు. రాకెట్‌ఎలాంటి అవాంతరాలు లేకుం డా అంతరిక్షంలోనికి దూసుకెళ్లింది. వాస్తవానికి ఈ ఉపగ్ర హాన్ని 2002లోనే నిర్మించారు. దేశీయంగా రూపొందించిన క్రయోజెనిక్‌ స్టేజ్‌ జిఎస్‌ఎల్‌వి అప్పటినుంచి ప్రయోగానికి ఎదురుచూస్తోంది.

భారీ రాకెట్‌ ప్రయోగవాహికనుంచి క్రయో జెనిక్‌ ఇంజన్‌వరకూ మొత్తం దేశీయ పరిజ్ఞానంతోనే రూపొం దించిన జిశాట్‌నిర్మాణం మన శాస్త్రవేత్తల ప్రతిభా నైపుణ్యాలకు నిదర్శనమనే చెప్పాలి. ఇస్రో అతిపెద్ద బరువైన ర్యాకెట్‌ కావడంతో బాహుబలి రాకెట్‌గా బహుముఖ ప్రచారంలోనికి వచ్చింది. సమాచార వ్యవస్థకు సంబంధించిన జిశాట్‌-29 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోనికి ప్రవేశపెట్టింది. ఈఉపగ్రహం లోనే కెయు, కెఎ బ్యాండ్‌ పేలోడ్‌లు ఏర్పాటుచేసారు. డిజిట ల్‌ ఇండియా కార్యాచరణలోభాగంగానే ఇస్రో జిశాట్‌-29కు రూపకలప్పనచేసింది. మరో రెండు కొత్తఅంతరిక్ష సాంకేతికత లపై అధ్యయనంచేస్తున్న ఇస్రో జీశాట్‌స రిస్‌ీలో మూడు ఉపగ్రహాలను పంపించాలనినిర్ణయించింది. వీటిలో జిశాట్‌- 19 ఉపగ్రహం గత ఏడాది జూన్‌లోనే శ్రీహరికోట షార్‌నుంచి ప్రయోగిస్తే మళ్లీ జిశాట్‌ 29 ఉపగ్రహం నింగిలోనికి ఇదే కేంద్రంనుంచి విజయవంతంగా పంపించారు. మరో ఉపగ్రం జిశాట్‌-11 ఉపగ్రహం వచ్చేనెలలో ఐరోపా స్పేస్‌పోర్టునుంచి నింగిలోనికి పంపించేందుకు ధృఢసంకల్పంతో ఉంది.

ఇస్రో సంస్థ వరుసగా 67 అంతరిక్ష ప్రయోగాలను పూర్తిచేసినట్ల యింది. ఇస్రో సమిష్టికృషివల్లనే ఉపగ్రహాల ప్రయోగం ఇటీ వలికాలంలో విజయవంతం అవుతున్నాయి. భారత అంతరిక్ష ప్రయోగాల్లో ఇదొక మైలురాయి వంటిదని ప్రధాని మోడీ నుంచి అందరు ప్రముఖులు ఇస్రోకృషిని ప్రశంసిస్తున్నారు. మార్క్‌3 ప్రయోగంతో దేశీయంగా అత్యధిక బరువైన ఉపగ్ర హాన్ని అంతరిక్షంలోనికిప్రవేశపెట్టగలిగారు. పిఎస్‌ఎల్‌వి తర హాలోనే జిఎస్‌ఎల్‌వి మార్క్‌3 రాకెట్‌ కూడా ఇస్రోప్రయో గాలకువిశ్వసనీయమైన వాహనంగా మారుతుందని శాస్త్రజ్ఞుల అంచనా. జనవరిలో చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని చేపట్టనున్న ఇస్రో మానవ సహిత ప్రయోగాలకుసైతం శ్రీకారం చుట్టేం దుకు ఇప్పటినుంచే ప్రయోగాలు ప్రారంభించింది. గగన్‌యాన్‌ ద్వారా అంతరిక్షంలోనికి వ్యోమగాములను పంపించి పరిశో ధనలు చేపట్టగలమని ఇస్రో ప్రకటించడం భారత శాస్త్ర సాం కేతిక పరిజ్ఞానానికి నిదర్శనంగా చెప్పాలి. తాజాగా ప్రయోగిం చిన రాకెట్‌ ఇస్రో అభివృద్ధిచేసిన ఐదోతరం రాకెట్‌ అని చెప్పా లి. నాలుగు టన్నుల బరువైన ఉపగ్రహాలనుసైతం భూస్థిర బదిలీ కక్ష్య (జియోస్టేషనరీ ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌)లోనికిప్రవేశ పెట్టగలదని అంచనా. ఈ ర్యాకెట్‌ 43.43 మీటర్ల పొడవు 640 టన్నుల బరువుతో ఉంది. జిఎస్‌ఎల్‌వి మార్క్‌3 డి2 రాకెట్‌ప్రయోగానికి ముందు తిరుమల వెంకటేశ్వరుని సన్ని ధిలో రాకెట్‌ నమూనాను స్వామి పాదాలచెంత ఉంచి ఇస్రో డైరెక్టర్‌ ప్రత్యేక పూజలు సైతం నిర్వహించారు.

దక్షిణ ఆంధ్ర ప్రదేశ్‌కోస్తా తీరంలోనే గంటకు 45-55కిలోమీటర్ల వేగం నుంచి 65 కిలోమీటర్లవరకూ పెరిగి తదనంతరం నిర్ణీత కక్ష్య లోనికి విజయవంతంగా దూసుకుపోయింది. ప్రవేశపెట్టిన ఉపగ్రహంలో క్రయోజెనిక్‌ ఇంజన్లు శక్తివంతంగాపనిచేస్తున్నట్లు ఇస్రో ధృవీకరించడంతో రెండోప్రయోగం కూడా విజయ వంతం అయిందనే చెప్పాలి. గడచిన కొన్నేళ్లుగాఇస్త్రో శాస్త్రవే త్తలు ప్రయోగించిన ఉపగ్రహాలు నిర్ణీత కక్ష్యల్లోనికి విజయ వంతంగా వెళ్లగలుగుతున్నాయి. అత్యంత భారీ ఉపగ్రహంగా మారిన జీశాట్‌ 29 అంతరిక్షంలో పదేళ్లపాటు సేవలందిస్తుం ది. దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని ప్రజల సమాచార అవసరాలను జిశాట్‌ కొత్త ఉపగ్రహం తీర్చగలదని అంచనా. చంద్రయాన్‌పై విశేష కృషిజరుపుతున్న ఇస్రో తదనంతరం మూడేళ్లలో గగన్‌యాన్‌ను కూడావిజయవంతంగా నిర్వహించ గలమని చెపుతున్నది.

ఇందుకు ప్రభుత్వ ప్రోత్సాహం, మౌలి కవనరులు, నిధుల కేటాయింపులు కూడా కీలకం అవుతాయి. ప్రభుత్వపరంగా ఎలాంటిఅడ్డంకులులేనందువల్లనేఇస్రో శాస్త్ర వేత్తలు గగనతలంలోనికి తమదైన ప్రతిభను చాటిచెపుతూ ఉపగ్రహాలను పంపించగలుగుతున్నారు. జిశాట్‌ ద్వారాప్రస్తు తం జమ్ముకాశ్మీర్‌లో నెలకొంటున్న పరిస్థితులను సైతం అధ్యయనం చేయగలుగుతారు.

ఈశాన్యప్రాంతాల్లోని మారు మూల ప్రాంతాల్లో నెలకొంటున్న కల్లోలపరిస్థితులు, భూగ్ర హసమాచారం మొత్తం ఇస్రోకు పంపిస్తుంది. గతంలోకూడా వివిధ వైజ్ఞానిక సమాచారం, భూగ్రహ సమాచారం, వాతావ రణంలో మార్పులు, అత్యాధునిక సాంకేతిక వ్యవస్థలకు సంబంధించి శాస్త్రవేత్తలు ప్రయోగించిన ఉపగ్రహ నౌకలు అంతరిక్షంలోనికి విజయవంతంగా దూసుకువెళ్లాయి. ఇతర దేశాలకు సంబంధించిన ఉపగ్రహాలనుసైతం భారత్‌ ఇస్రో లాంచ్‌పాడ్‌నుంచి ప్రయోగించి తన ప్రతిభను చాటిచెప్పింది. భారీ శాటిలైట్‌లను పంపించగలిగే శాటిలైట్‌ వాహికలు అందుబాటులో లేని తరుణంలోనే ఇతర దేశాలనుంచి సైతం మన ఉపగ్రహాలను అంతరిక్షంలోనికి పంపించగలిగింది. దేశభవిష్యత్తు కోసం రూపొందిచిన జిశాట్‌-29తో పాటే ఇస్రో చంద్రయాన్‌, గగన్‌యాన్‌ల ద్వారా విశ్వవ్యాప్తంగా పేరుప్రతి ష్టలను మూటగట్టుకుంటున్నదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందుకు శాస్త్రవేత్తల బహుముఖ కృషి సర్వదా ప్రశంసనీయం.

– దామెర్ల సాయిబాబ,ఎడిటర్‌, హైదరాబాద్‌