ఏపిలో గ్రూప్‌-1 పరీక్షలు ప్రారంభం

exam
exam

అమరావతి: ఏపిలో రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్ 1 ప్రిలిమినరీ పేపర్ 1 పరీక్ష ప్రారంభమైంది. 13 జిల్లాల్లో 258 కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు పేపర్లుగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తున్నారు. 169 గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసం ఏపీపీఎస్సీ విడుదల చేసిన నోటిఫికేషన్‌కు లక్షా 14వేల 473మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షకు అరగంట ముందుగా అభ్యర్థులను లోనికి అనుమతించనున్నట్లు ప్రకటించడంతో… పరీక్ష రాసే వారు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ప్రతి కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2గంటల నుంచి 4గంటల వరకు పేపర్ 2 పరీక్ష నిర్వహించనున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/