ఐదో విడత పోలింగ్‌లో పలు చోట్ల ఘర్షణలు, గ్రెనేడ్ దాడి

grenade attack
grenade attack

శ్రీనగర్‌: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రారంభమైన ఐదో దశ పోలింగ్‌ సందర్భంగా దేశంలో పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. అనంతనాగ్‌ నియోజకవర్గ పరిధిలో పోలింగ్‌ కేంద్రంపై ఉగ్రవాదాలు గ్రెనేడ్‌ విసిరారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు వెల్లడించారు. బీహార్‌లోని ఛాప్రా పోలింగ్‌ బూత్‌ నంబర్‌ 131లో ఈవిఎంను ధ్వంసం చేసిన ఘటనలో రంజిత్‌ పాశ్వాన్‌ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అలాగే పశ్చిమ బెంగాల్‌లోని బారక్‌పూర్‌ నియోజకర్గ పరిధిలో బిజెపి, తృణమూల్‌ వర్గీయుల మధ్య గొడవలు చోటుచేసుకున్నాయి. గత నాలుగు విదతల ఎన్నికల్లోనూ బెంగాల్‌లో పలుచోట్ల ఘర్షణలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈసారి కేంద్ర సాయుధ బలగాలతో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. ఐనా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/