పరవాడ గ్యాస్ లీక్ ఘటనపై గ్రీన్ ట్రైబ్యునల్‌లో విచారణ

సుమోటోగా స్వీకరించి విచారణ ప్రారంభించిన ఎన్‌జీటీ

NGT

విశాఖ: విశాఖపట్నం పరవాడలోని సాయినార్ ‌లైఫ్ సైన్సెస్‌లో జూన్‌ 30న గ్యాస్‌లీక్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు ఉద్యోగులు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ ఘటనకు సంబంధించి కథనాల ఆధారంగా ఈ కేసును సుమోటోగా స్వీకరించిన ఎన్‌జీటీ ఇప్పటికే విచారణ ప్రారంభించింది. తాజాగా, నేడు ఈ కేసును విచారించనుంది. మరోవైపు, సాయినార్ లైఫ్ సైన్సెస్‌పై ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/