ఏ సమయాలలో గ్రీన్‌టీ

ఆహారం-అలవాట్లు

Green Tea
Green Tea

గ్రీన్‌ టీ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో మనందరికి తెలిసిందే. కాగా వారానికి మూడు సార్లు గ్రీన్‌ టీ తాగితే మనిషి జీవితకాలం పెరగడంతో పాటు గుండెపోటు, స్ట్రోక్‌ ముప్పులను నివారించవచ్చని ఎన్నో అధ్యయాలు స్పష్టం చేశాయి. కాగా గ్రీన్‌ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్స్‌తో హృదయం పదిలంగా ఉండటంతోపాటు ఎక్కువకాలం ఆరోగ్యకరంగా జీవించేందుకు దోహదపడుతుందని పరిశోధకులు తేల్చారు. కానీ గ్రీన్‌ టీ ఏ సమయంలో తీసుకోవాలో కూడా చాలా ముఖ్యమని పరిశోధకులు విశ్లేషిస్తున్నారు. కొన్ని సమయాలలో గ్రీన్‌ టీని తీసుకోవద్దని నిపుణులు పేర్కొంటున్నారు.


రాత్రి పడుకునే ముందు : మీరు నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా, అయితే గ్రీన్‌టీ తీసుకునే సమయంలో జాగ్రత్త వహించాలి. రాత్రి పడుకునే ముందు గ్రీన్‌ టీని సేవిస్తే నిద్రలేమి సమస్యలు ఎదురు కావచ్చు. గ్రీన్‌ టీలోకెఇన్‌ ఉండడంవల్ల నిద్ర ప్రేరిపిత మెలటోనిన్‌ విడుదలను అడ్డుకుంటుంది.
ఉదయాన్నే గ్రీన్‌ టీ విషయంలో జాగ్రత్త : ఉదయాన్నే లేచిన వెంటనే ఖాళీ కడుపుతో గ్రీన్‌ టీని సేవించడం అనారోగ్యమని నిపుణులు చెబుతున్నారు. గ్రీన్‌ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌, పాలీఫినాల్స్‌ గ్యాస్ట్రిక్‌ యాసిడ్‌లను ప్రేరేపించి, జీర్ణక్రియ సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. అందుకే ఉదయాన టిఫిన్‌ చేశాక గ్రీన్‌టీని సేవించడం ఆరోగ్యకరం.

గ్రీన్‌టీతో మందులు వేసుకుంటే అంతే :

ఏదయినా వ్యాధితో బాధపడుతున్నట్లయితే కొందరు ఓ కప్పు గ్రీన్‌టీతో మందులు వేసుకుంటారు. కానీ అలా మందులు వేసుకోవడం ఆరోగ్యానికి హానికరం, మందులలో ఉండే కెమికల్స్‌ గ్రీన్‌ టీతో కలిసిన క్రమలో అసిడిటీ సమస్యలు తలెత్తె అవకాశముంది.

భోజన సమయంలో జాగ్రత్త :

సాధారణంగా గ్రీన్‌ టీ సేవిస్తే జీర్ణకక్రియ సమస్యలకు ఎంతో ఉపయోగం. కానీ మధ్యాహ్న భోజనం తరువాత గ్రీన్‌టీ సేవిస్తే భోజం నుంచి లభించే పోషక విలువలు తగ్గి, పోషకాహార లోప సమస్యలు తలెత్తె అవకాశంఉందని నిపుణులు సూచిస్తున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/