దంతక్షయాన్ని తగ్గించే గ్రీన్‌టీ
దంత సంరక్షణ-జాగ్రత్తలు-
పళ్లకు సంబంధించిన సమస్యల్లో పాచి ఒకటి. అది పళ్లు పుచ్చిపోవడానికి కారణమవుతుంది. గ్రీన్ టీ తీసుకోవడం వల్ల దీని బారి నుంచి బయటపడవచ్చు.
గ్రీన్ టీలో ఎపిగల్లోకాటెజిన్ గాలెట్ ఉంటుంది. ఇది పన్ను పుచ్చిపోవడానికి కారణమయ్యే బ్యాక్టీరియాతో విపరీతంగా పోరాడుతుంది.
కొన్నిసార్లు మనం తీసుకునే ఫుడ్లోని చిన్న చిన్న తునకలు పళ్లలో ఇరుక్కుని, బ్యాక్టీరియాగా మారి దంతక్షయానికి కారణమవుతుంది.
ఈ విషయంలోను గ్రీన్ టీ సాయపడుతుంది. బాక్టీరియాను తగ్గించడంలో గ్రీన్ టీ మంచి రోల్ పోషిస్తుందన్న విషయం పలు అధ్యయనాల్లో రుజువైంది.
నోటికి సంబంధించిన పమస్య గొంతు వెనుక భాగానికి కూడా పాకుతుంది. అక్కడ బ్యాక్టీరియా పెరిగి నోటి దుర్వాసనకు కారణమవుతుంది.
ఆ ప్రదేశాన్ని టూత్ బ్రష్‌తో కూడా క్లీన్ చేయలేం. దాంతో ఒకసారి అక్కడ బాక్టీరియా చేరాక దుర్మాసనను దూరం చేయడం కష్టమైన పని. దీనికి కూడా గ్రీన్ ఉపయోగపడుతుంది.
గ్రీన్ టీ లోని పాలీఫెనాల్స్ ఈ బ్యాక్టీరియాను అడ్డుకోవడంలో సాయపడుతుంది.
తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/